చంద్రబాబు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారు

306

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం.
తాడేపల్లి
మార్చి 03.
–చంద్రబాబు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారు.
–ఓట్ల కోసం తాగుబోతులకు అనుకూలంగా మాట్లాడితే మహిళలు టిడిపినేతల బ్యాండ్‌ బజాయిస్తారు.
–మద్యనిషేధం శ్రీ వైయస్‌ జగన్‌ గారు చేసి తీరతారు.
–పరిమితికి మించి మద్యం బాటిల్స్‌ కలిగిఉన్న బొండాఉమను అరెస్ట్‌ చేయాలి.
–వాలంటీర్లతో మద్యం డోర్‌ డెలివరీ చేశారనే ఆరోపణలు చంద్రబాబు నిరూపిస్తే రాజీనామాలు చేయడానికి నేను సిధ్దం.
–స్దానికసంస్దల ఎన్నికలలో చంద్రబాబుకు ఓటమి తప్పదు.
పార్టీ ఎంఎల్‌ ఏ శ్రీమతి ఆర్‌ కే రోజా ప్రెస్‌ మీట్‌ పాయింట్స్‌
1.టిడిపి నేత బొండా ఉమ ప్రెస్‌ మీట్‌ చూస్తే సిగ్గుచేటుగా అనిపిస్తుంది.తన ముందు మద్యం బ్రాండ్‌ లన్నీ పెట్టుకుని వైన్‌ షాపులోనో, బార్‌ లోలాగా కూర్చుని సెల్స్‌ మెన్‌ లాగా ఉన్నాడు.ప్రజలు ఏమనకుంటారనే ఆలోచన లేకుండా పోయింది.సిగ్గుచేటు
2.కల్లుతాగిన కోతులు ఏ విధంగా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తాయో టిడిపినేతల చేష్టలు ఆ విధంగా కనిపిస్తున్నాయి.ఈరోజు టిడిపి కార్యాలయంలో ఈ విధంగా బాటిల్స్‌ పట్టుకుని ప్రెస్‌ మీట్లు పెడుతుంటే అది టిడిపి కార్యాలయమా?లేక లోకేష్‌ వైన్‌ షాపా?అది పార్టీ ఆఫీసా? లేక చంద్రన్న బెల్ట్‌ షాపా? అనేది అందరికి డౌట్‌ వస్తోంది.
3.మా ప్రభుత్వం వచ్చాక ఎవరైతే మద్యానికి బానిస అవుతారో వారిని ఢీఅడిక్షన్‌ సెంటర్‌ కు పంపించి బాగుచేయాలని అనుకున్నాం.ఈరోజు డిసైడ్‌ అయ్యాం.మద్యం కమీషన్లకు బానిసై కొట్టుకుంటున్న టిడిపి నేతలందర్ని ఢీఅడిక్షన్‌ సెంటర్లకు పంపి క్యూర్‌ చేయాల్సిన అవసరం ఉంది.
4.రాష్ట్రంలో 9 నెలలనుంచి మనం చూస్తున్నాం.సాక్షాత్తు ప్రతిపక్షనేతతో సహా టిడిపినేతలు అందరూ కూడా టైమ్‌ సరిపోవడం లేదు.బ్రాండ్లులేవు.టైమ్‌ పెంచండి.రేట్లు తగ్గించండి.అంటూ ప్రతిపక్షనేత మాట్లాడుతున్నతీరుచూస్తే ఆయన ప్రతిపక్షనేతకాదు, తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు అన్నట్లుగా ఉంది.
5.చంద్రబాబునాయుడు,టిడిపినేతలకు సవాల్‌ చేస్తున్నా….
మీ ప్రభుత్వంలో 43 బెల్టుషాపులను రద్దుచేశారా?
మీ హయాంలో వైన్‌ షాపులను తగ్గించేఆలోచన చేశారా?
మీ పరిపాలనలో బార్లను తగ్గించిన చరిత్ర ఉందా?
అదే మా వైయస్‌ జగన్‌ గారి పాలనలో అయితే అధికారంలోకి వచ్చిన నెలలోనే 43 వేల బెల్ట్‌ షాపులను రద్దుచేశారు.20 శాతం వైన్‌ షాపులను,40శాతం బార్లను తగ్గించారు.
6.మీరు సిగ్గులేకుండా అలాంటి జగన్‌ గారిని, ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత ఉందా అనేది ఆలోచించండి.జగన్‌ గారు మహిళల పసుపు కుంకుమల గురించి ఆలోచిస్తున్నారు. మహిళల గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఆయనను మీరు విమర్శించడం సిగ్గుచేటు.
7.మీ పాలనలో చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారించారు.సిఎం సంతకం చేస్తే అది ఐఎస్‌ ఐ ముద్రలాగా ఉండాలి.వైయస్‌ రాజశేఖరరెడ్డి సంతకం మనం చూశాం.రైతులకు ఉచిత విద్యుత్‌ అధికారంలోకి వచ్చిన మరు నిముషమే అమలులోకి వచ్చింది.
8.కాని చంద్రబాబు చేసిన తొలిసంతకం బెల్ట్‌ షాపులను నిర్మూలిస్తానని చెప్పారు.కాని ఆయన అధికారంనుంచి దిగిపోయేనాటికి 43 వేల బెల్ట్‌ షాపులు ఉన్నాయి.అంటే ఆయన సంతకం వేస్ట్‌ అని తేలిపోయింది.
9.ప్రతి ఏటా 20 శాతం మద్యం అమ్మకాలను పెంచుకుంటూ పోయి మహిళల తాలిబొట్లు తెగేవిధంగా గతఐదేళ్లలో చంద్రబాబు నారాపాలన సారాపాలనగా సాగినతీరును ఆ పరిపాలనను మహిళలు మరిచిపోలేదు.చంద్రబాబు ఏటా టార్గెట్‌ లు పెట్టి అదికారులద్వారా ప్రజలతోతాగుడు పెంచే కార్యక్రమాలను అమలు చేశారు.వారిఅప్పటిమంత్రి జవహర్‌ అప్పట్లో హెల్త్‌ డ్రింక్‌ అని బీర్‌ ను ప్రమోట్‌ చేశారు
10..ముఖ్యమంత్రి జగన్‌ గారు మద్యాన్ని ఎలాగైనా మగవారికి దూరం చేయాలి.ఆడవారి పసుపు కుంకుమను కాపాడాలి.మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేయాలి.అని ఆలోచన చేశారు.
11.ఆదివారం రోజున ప్రతి ఒక్కరికి సెలవు.సూర్యుడు ఉదయించకముందే అవ్వాతాతలకు పెన్సన్‌ అందించారు.రోగగ్రస్తులకు దగ్గరకు వెళ్లి పెన్సన్‌ లు ఇచ్చారు.పేదలు, వితంతువులకు ఆదివారం అని కూడా చూడకుండా పనిచేసిన వాలంటీర్లను అభినందిస్తున్నాను.సెల్యూట్‌ చేస్తున్నాను.
12.వారు వాలంటీర్లు అనేకంటే వారియర్స్‌ అనచ్చు.చంద్రబాబు ఎవరిని వదల్లేదు. వాలంటీర్లను సైతం ఎవరూ లేనప్పుడు వెళ్లి తలుపుతట్టారు అంటూ ఘోరంగా మాట్లాడారు.వాలంటీర్లపై చాలా ఫిర్యాదులున్నాయని,వాలంటీర్లగా జాయిన్‌ అయితే వారికి పెళ్లిళ్లు్ల కావని మాట్లాడారు.
13.ఇంకాముందుకు వెళ్లి వాలంటీర్లతో మద్యం డోర్‌ డెలివరీ చేస్తున్నారని ఆరోపించారు.అది నోరా తాటిమట్టా.అలాంటి ఆరోపణలు నిరూపిస్తే మేం రాజీనామాలు చేస్తాం. నోరుంది కదా, పచ్చఛానల్స్‌ చూపిస్తాయి కదా అని ఇష్టానికి మాట్లాడితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు.
14.లోకల్‌ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి.ఈరోజు టిడిపి వాళ్లు తెలుసుకోవాల్సింది.మీరు మాట్లాడే పిచ్చిమాటలకు, పిచ్చిప్రవర్తనలకు రాష్ట్ర ప్రజలందరూ కూడా మొన్నటి ఎన్నికలలోకంటే డబుల్‌ గా ఛీత్కరించి తరిమికొడతారు.
15.అన్ని సంక్షేమ పధకాలను ప్రజలవద్దకు తీసుకువెళ్తున్న వాలంటీర్లే టిడిపికి పుట్టగతులులేకుండా చేస్తారు.మహిళలు రెడీగా ఉన్నారు.మహిళా ఎంఎల్‌ ఏ అని కూడా చూడకుండా టిడిపి మహిళా ఎంఎల్‌ ఏ తో అసెంబ్లీలో మద్యం బ్రాండ్ల గురించి మాట్లాడేలాచేసి చంద్రబాబు దిగజార్చేలా చేశారు.
16. మద్యం ధరలు పెరిగితే నిత్యావసరాలధరలు పెరిగినంత ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారు.మహిళలతో రాజధాని అంశంలో గాని, లిక్కర్‌ ,ఇసుక అంశాలలో వీడియోలు తీయడం వాటిని యూట్యూబ్‌ లలో ఎక్కించడం .ఇవేవి ఛానల్స్‌ లో రావు.ఇవన్నీ వారి పెయిడ్‌ ఆర్టిస్టులతో శాడిస్టిక్‌ గా చేస్తున్నారు.మానసిక తృప్తి కోసం ఇదంతా చేస్తున్నారు.ఇది మహిళలు గమనిస్తున్నారు.
17.శ్రీవైయస్‌ జగన్‌ గారు మహిళలకోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. వారి గౌరవం కోసం, మహిళల రక్షణకోసం, ఆర్దిక ఉన్నతికోసం,సాధికారితకోసం ఇవన్నీ చేస్తున్నారు. అమ్మఒడి,25 లక్షల ఇళ్ల పట్టాలు మహిళలపేరుతో ఇస్తున్నారు.50 శాతం రిజర్వేషన్లు,వాలంటీర్ల పోస్టులు,నామినేటెడ్‌ పదవులు,వర్క్స్‌ ,విద్యాదీవెన,వైయస్సార్‌ గృహవసతి మహిళలకు ఇచ్చారు.
18 దిశ చట్టాన్ని తీసుకువచ్చి దిశపోలీసు స్టేషన్లు పెట్టింది కూడా మహిళల రక్షణకోసమే అని గర్వంగా చెబుతున్నాను.మార్చి 8 న జరిగే మహిళా దినోత్సవం నిజమైన మహిళా దినోత్సవం.జగన్‌ గారు మహిళలకు ఇచ్చిన కానుక.వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా ఎంఎల్‌ ఏగా గర్వంగా చెప్పగలుగుతున్నాను.
19.టిడిపి నేతలూ…ఇప్పటికైనా బార్ల గురించి మాట్లాడటం మానేసి బాధ్యతగా మాట్లాడండి.పెద్దమనస్సుతో రాష్ట్రానికి మేలు చేసే పనులు చేస్తున్న జగన్‌ గారని అభినందించకపోతే పోయారు.ఆయనపై బురదచల్లే కార్యక్రమాలు చేసి ప్రజలలో చులకన అయిపోవద్దని చెబుతున్నాను.
20.వైన్‌ ,బార్ల వద్ద మద్యం లిమిటెడ్‌ గానే తీసుకోవాలి.అంతకంటే ఎక్కువగా తీసుకుని వ్యక్తులు స్టాక్‌ పెట్టుకుంటే అరెస్ట్‌ అవుతున్నారు.అంతటి కఠినచట్టాలు తీసుకువచ్చిన జగన్‌ గారు…. టిడిపి మాజీ ఎంఎల్‌ ఏ అయిఉండి టిడిపి కార్యాలయంలో ఇన్ని బాటిల్స్‌ పెట్టుకుని చట్టాన్ని వ్యతిరేకించిన ఆయనపై కేసు పెట్టి లోపల వేయాలి.
21.మద్యపాన నిషేధాన్ని శ్రీ వైయస్‌ జగన్‌ అమలుచేసి తీరతారు.ఓట్ల కోసం మద్యంతాగేవారికి అనుకూలంగా మగవారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఆడవారు మీ బ్యాండ్‌ బజాయించడానికి రెడీగా ఉన్నారు.మహిళలు జగన్‌ గారికి అండగా వారియర్స్‌ లాగా పనిచేశారు.పసుపు కుంకుమపేరుతో మహిళలను మోసం చేయాలని ప్రయత్నించిన చంద్రబాబును తిరస్కరించి జగన్‌ గారిని గెలిపించారు.ఇంకా అవాకులు చెవాకులు పేలితే పరిస్దితులు దారుణంగా ఉంటాయి.
22.విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ….ఉద్యోగులపై దాడులు చేసింది టిడిపినే.మహిళా తహసిల్దార్‌ వనజాక్షిపై దాడిచేస్తే సెటిల్‌ మెంట్‌ మినిస్టర్‌ గా చంద్రబాబు పంచాయితీ అందరికి తెలిసిందే.చింతమనేని ఉద్యోగులపై ఏవిధంగా దాడులు చేశారో అందరికి తెలుసు..విజయవాడలో ఎంపి కేశినేని,ఎంఎల్సిబుద్దావెంకన్న,నాటి ఎంఎల్‌ ఏ బొండాఉమాలు ఐపిఎస్‌ అధికారిని బెదిరిస్తే చంద్రబాబు వ్యవహరించిన తీరు ప్రజలకు తెలుసు.మేం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఉద్యోగులకు ఎంత గౌరవం ఇస్తున్నామో అందరికి తెలుసు.

1 COMMENT