గవర్నర్‌‌ను కలిసిన బీజేపీ నేతలు…

162

గవర్నర్ బిశ్వభూషన్ హరించదన్‌తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు సోమవారం ఉదయం కలుసుకున్నారు. రాష్ట్రంలో ఆలయాల కూల్చివేతలు, నెల్లూరులో రథానికి నిప్పుపెట్టడంపై గవర్నర్‌కు నేతలు ఫిర్యాదు చేశారు. ధాన్యం కొనుగోలు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించలేదని, గోపాల మిత్రకు కేంద్రం ఇచ్చిన నిధులు ఇతరవాటికి మళ్లిస్తున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు