సహారా సేవ సంస్థ లో  ఒంటరి వృద్దులకు  సేవా కార్యక్రమాలు

495

సహారా సేవ సంస్థ అద్వర్యం లో ఈ రోజు శని వారం (29.2.20)  న  జరిగిన కార్యక్రమములో మురికి వాడలో  నివసిస్తున్న   వృద్ధులకు వేసవి లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి  తెలియ జేయడమే కాకుండా  వారికీ అల్పాహారం  తో బాటు కావలసిన  నిత్యావసర వస్తువులను  పంపిణి చేయడం జరిగినది.  అమిటీ యూనివర్సిటీ లో ఎం ఫి ఎహ్     ( MPH-మాస్టర్ అఫ్ పబ్లిక్ హెల్త్ ) స్పెషలిస్ట్ కింశుక్ సేన్ గుప్త వృద్దులకు వేసవిలో వీలైనంత వరకు నీడ పట్టున వుంది ఎక్కువగా నీరు తిరగాలని,  అత్యవసర పరిస్థితుల్లో తప్ప పగటి పూత బయటకు వేళ్ళ రాదని  పలు సూచనలు చేసారు. అంబర్ పేట  లోని భారతి విద్య భవన్ పాఠశాల విద్యార్థులు మరియు . పాద్యాయులు  వారు సేకరించిన  బియ్యం, పప్పు, సబ్బులు, నూనె, పంచదార,   టి  పౌడర్ , రవ్వ , బిస్కెట్స్, తదితర అనేక నిత్యావసర వస్తువులను వృద్దులకు  అందజేశారు. అంతే  కాకుండా వారికీ ఎల్ల వేళల  సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

దాత శివ షాలిని వృద్దులకు అల్పాహారం, స్వీట్స్ అందించారు.   ఈ సందర్భంగా సహారా సంస్థ డైరెక్టర్ రామగిరి  నరసింగ రావు  గారు మాట్లాడుతూ ‘  ఒంటరిగా నివసిస్తున్న వృద్దులకు  సహాయ సహకారాలు  అందించ వలసిన సామజిక  భాద్యత  ప్రతి ఒక్కరిదాని, ముఖ్యంగా  విద్యార్థులు వృద్ధుల పట్ల సేవ కార్యక్రమాలు చేపట్టడం కొనియాడదగినదన్నారు.  ఈ కార్యక్రమం లో  అన్నదాత కుమారి శివ షాలిని,   సహారా సంస్థ  కార్య నిర్వాహకురాలు  మల్లేశ్వరి మరియు వాలంటీర్లు పాల్గొని   వృద్ధులకు  సహాయ సహకారాలు అందించారు.

ఇట్లు

మల్లేశ్వరి  – ప్రాజెక్ట్ కోఆర్డినేటర్