కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖకు, జవాబు

335

ఎపి బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖకు డిజిపి కార్యాలయం జవాబు ఇచ్చింది.సుమారు 280 మంది పోలీసు అదికారులను వెయిటింగ్ లో ఉంచారని,దీని ప్రభావం శాంతి భద్రతల పైన పడుతుందని ఆయన తెలిపారు.వెంటనే వెయిటింగ్ లో ఉన్న అదికారులకు పోస్టింగ్ లు ఇవ్వాలని ఆయన కోరారు.దీనికి డిజిపి ఆఫీస్ స్పందిస్తూ,జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న కన్నా లక్ష్మీనారాయణ వాస్తవాలు తెలుసుకోకుండా పోలీస్‌ శాఖపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నట్టుగా పోలీస్‌ శాఖలో ప్రస్తుతం 80 మంది డీఎస్పీలు వెయింటింగ్‌లో ఉన్నారన్నది వాస్తవం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం 14 మంది డీఎస్పీలు మాత్రమే.. శాఖాపరమైన కారణాలతో వెయిటింగ్‌లో ఉన్నారని తెలిపింది.