ఉగాది లో పే ఎన్నికలు………

288
Electronic Voting Machines (EVMs) and Voter Verifiable Paper Audit Trail System (VVPATs), display during Press confrence “EVM Challenge” at Vigyan Bhawan in New Delhi on Saturday. PHOTO BY SANJEEV RASTOGI
Electronic Voting Machines (EVMs) and Voter Verifiable Paper Audit Trail System (VVPATs), display during Press confrence “EVM Challenge” at Vigyan Bhawan in New Delhi on Saturday.
PHOTO BY SANJEEV RASTOGI

రాష్ట్రంలోని మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థలు, పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను ఉగాదిలోగా నిcర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేసారు. జనాభాకు అనుగుణంగా బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం చేయకూడదన్న తలంపుతోనే 59.75 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. రిజర్వేషన్లు అమలు కాకుండా మోకాలడ్డేందుకు కొంతమంది టీడీపీ నేతలు కోర్టుకెళ్లారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరిందని, 59.75 శాతం రిజర్వేషన్లతో ఎందుకు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించామో వివరిస్తూ కోర్టులో ప్రభుత్వం తరపున అఫిడవిట్‌ దాఖలు చేశామన్నారు.

రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు కూడా సానుకూలంగానే స్పందిస్తుందని, సోమవారం వెలువడనున్న తుది తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగానే వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కోర్టు తీర్పును అనుసరించి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికలు ఆలస్యమైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోతాయని గుర్తు చేశారు. రానున్న వేసవిలో నగర, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఇళ్లస్థలాల కోసం విశాఖతోపాటు పలు జిల్లాల్లో భూ సమీకరణ ద్వారా భూములను సేకరించామన్నారు.