విశాఖలో జగన్ అండ్ కో భూకబ్జాలు బహిరంగం అవుతుందనే

459

చంద్రబాబు గారి పర్యటనను అడ్డుకున్నారు –

 పులివెందుల రౌడీలపై చర్యలు తీసుకోవాలిః అచ్చెన్నాయుడు

విశాఖలో జగన్ అండ్  కో పెద్దఎత్తున చేసిన భూకబ్జాల గుట్టురట్టు అవుతుందనే భయంతోనే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గారి పర్యటనను వైసీపీ అడ్డుకుంది. చంద్రబాబు గారి వెళితే వారి అసలు రంగు బయటపడుతుందనే.. పులివెందుల రౌడీలు, వైకాపా కార్యకర్తలతో దాడి చేయించారు. అక్రమంగా అరెస్ట్ చేశారు. విశాఖలో వైసీపీ నేతలు ఎలాంటి భూకబ్జాలు, పేదల భూములను అన్యాయంగా లాక్కోలేదని నిరూపించుకోవాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. ప్రశాంతత కోరుకునే విశాఖ ప్రజలు.. వైసీపీ అరాచకాలను చూసి అసహ్యించుకుంటున్నారు. విశాఖకు వచ్చే పెట్టుబడులన్నీ తరిమివేసి అభివృద్ధి గురించి వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ప్రతిపక్ష నేతపై కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడిచేసిన వారిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అమరావతిలో ఒక ఎంపీకి పూలు  ఇచ్చినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న ప్రతిపక్ష నేతపై వైసీపీ గూండాలు దాడికి దిగితే నాన్ బెయిలబుల్ కేసులు ఎందుకు నమోదు చేయలేదు? చంద్రబాబుగారిపై దాడి ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టుకు కూడా నివేదిస్తాం. రాష్ట్రం మొత్తాన్ని పులివెందుల పంచాయతీగా మార్చేందుకు జగన్ అండ్ కో కంకణం కట్టుకున్నారు. విమానాశ్రయానికి ముందుగానే పులివెందుల గూండాలను, వైసీపీ కార్యకర్తలను తరలించి ప్రతిపక్ష నేతపై దాడికి దిగారు. కోడిగుడ్లు, టమోటాలను ముందుగానే సిద్ధం చేసుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? 300 మందికి పైగా ఉన్న పోలీసులు 10 మంది వైకాపా కార్యకర్తలను అడ్డుకోకపోవడం దేనికి సంకేతం? అద్దె మనుషులతో ఆందోళన చేయించిన ఘనత అధికార పార్టీకే దక్కుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలు హింసా రాజకీయాలకు దూరంగా ఉంటారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రతిపక్ష నేతపై పక్కా ప్రణాళికతో దాడికి దిగిన వైసీపీ తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారు. విశాఖలో జరిగిన భూ అక్రమాలను ప్రజల ముందు ఉంచేవరకు తెలుగుదేశం పోరాటం కొనసాగుతుంది.