పిలుపు రానందుకు సిగ్గు పడాలి వైసీపీ

498

• గత రెండు రోజులుగా దేశమంతటా , రాష్ట్రమంతటా ఒకటే చర్చ. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చిన సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఎందుకు లేదన్న చర్చ రెండు రోజులుగా జరుగుతోంది.
• మన సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక ముఖ్యమంత్రులకు విందుకు పిలిచారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రం పిలవలేదు. జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర, క్రిమినల్ కేసులు, నియంత వ్యవహారం ఆంధ్ర రాష్ట్రానికి అంటుకుంది కాబట్టే  ఈరోజు  పిలుపు రాలేదు.
• పిలుపు రానందుకు సిగ్గు పడాల్సినంది పోయి వైసీపీ నాయకులు వెకిలి నవ్వులు నవ్వుతూ దీనికి సమాధానం చెప్పకుండా దాటవేసే పరిస్థితికి వచ్చారు.
• ఎంత దౌర్భాగ్యమంటే…ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ప్రపంచంలో తెలుగువారు ఎక్కడి వెళ్లి మాట్లాడినా, కలిసినా మద్రాసీలా అని అడిగేవారు. ఆ స్థాయి నుంచి మేం తెలుగు వారం అని గర్వంగా చెప్పే స్థాయికి ఎన్టీఆర్ తీసుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు గారి హయాంలో అనేక పరిశ్రమలు పెట్టుబడులుతో వచ్చాయి.  ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలను తీసుకొచ్చారు. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ కంపెనీ న్యూయార్క్ లోనే ఉండేది. దాని బ్రాంచ్ ఏపీకి తీసుకొచ్చి ఘనత చంద్రబాబుదే.
• చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి సాఫ్ట్ వేర్ దిగ్గజం బిల్ గేట్స్ ను తీసుకొచ్చారు. అమెరికా, సింగపూర్ , నేపాల్ దేశాధినేతలతో పాటు ప్రపంచ బ్యాంకు అధ్యక్షులు, ఐక్యరాజ్యసమతి ప్రధాన కార్యదర్శి, మారిషస్ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చారు.
• ఈరోజు చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే డోనాల్డ్ ట్రంప్ గుజరాత్ వెళ్లకుండా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఉండేవారని ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
• ఇవాళ రాష్ట్ర పరిస్థితికి వైసీపీనే కారణమని అందరికీ తెలుసు. వీరి యొక్క విధానాల వల్ల ఈ రోజు పిలుపుకు నోచుకోలేదు. 96 మందిని పిలిస్తే అందులో ఏపీ సీఎం లేరు. వీరి యొక్క విధి విధానాలు, ప్రవర్తన, ప్రపంచస్థాయిలో వీరికున్న మనీల్యాండరింగ్ కేసుల వల్ల పిలుపు అందలేదన్నది స్పష్టమవుతోంది.
• ఇంటర్ పోల్ వాళ్లు వీరిని వెదుకుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడైనా పర్యటిస్తే ఆ దేశం వారు ఎవరిని పిలవాలో పిలవకూడదో చెక్ చేసుకుంటారు . ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపు అందకపోవడానికి కారణం అదే.
• జగన్ అండ్ గ్యాంగ్ ఏ దేశం వెళ్లినా అక్కడి విమానాశ్రయాల్లో పట్టుకుని జైళ్లలో పెట్టేస్తున్నారు. అందుకు సాక్ష్యం నిమ్మగడ్డ ప్రసాద్ గారు. బెల్ గేడ్ విమానాశ్రయంలో ఆయనేదో విహారయాత్రకు వెళితే అక్కడ పట్టుకుని జైల్లో పెట్టారు. ఇప్పుడు జగన్ గారు వెళ్లినా అదే పరిస్థితి.
• జైలు భయంతోనే జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్లలేదు. పెట్టుబడులు ఆకర్షణకు ప్రయత్నాలు చేయలేదు. దావోస్ ఎకనమిక్ ఫోరం మీటింగ్స కు వీళ్లు ఎగ్గొట్టారు.
• గతంలో చంద్రబాబు నాయుడు  దావోస్ లో జరిగిన సమావేశాల్లో ఎంతో కష్టపడి పెట్టుబడులు తెచ్చారు. సందర్భం వచ్చింది కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకు ఓ విషయం చెప్పాలి. దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు చంద్రబాబు నాయుడు వయస్సు  68 ఏళ్లు. భరించలేనంత చలి…అయినా సరే అక్కడికెళ్లి మాట్లాడారు. రాత్రి ఒంటి గంట వరకూ మీటింగ్ లతోనే సరిపోయేది.  ఉదయాన్ని చంద్రబాబు గారిని కలుద్దామని హోటల్ రూం కి వెళ్లిన అధికారుల బృందం అక్కడ ఆయన లేకపోవడంతో షాక్ కు గురయ్యారు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఏపీ స్టాల్ దగ్గర కూర్చున్నారు. ఏమిటి సార్ మీరిక్కడ కూర్చున్నారని అధికారుల బృందం అడగ్గా…రూంలో కూర్చుంటే ఏమొస్తుంది? స్టాల్ దగ్గర కూర్చుంటే ఎవరన్నా ఫారినర్స్ తో మాట్లాడతాను…అమరావతికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక పెట్టుబడి వస్తే వందమందికి ఉద్యోగాలు వస్తాయి…రూంలో కూర్చుంటే ఏం ఉపయోగం అని చంద్రబాబు సమాధానం చెప్పారు
• ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి  ఏం చేస్తున్నారు…మాయని మచ్చగా తయారయ్యారు. ఏపీకి పెట్టబడులు రావని చెప్పే పరిస్థితికి అందరూ వచ్చేశారు. పీపీఏల విషయంలో ఇకపై ఏపీలో అడుగుపెట్టకూడదని జపాన్ అంబాసిడర్స్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి వ్యాపారం చేయడం కానీ ఏపీ మాత్రం వెళ్లొద్దని వారు పిలుపునిచ్చారు.
• లూలూ, అదానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ , అంబానీ , పేపర్ మిల్లు యాజమాన్యం తరలిపోయారు. ఫలితంగా లక్షా ఎనభై వేల కోట్ల పెట్టుబడులు వెళ్లిపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రికి చీమకుట్టినట్టు కూడా లేదు. కనీసం సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా ముఖ్యమంత్రి లేరు.
• ప్రపంచ ప్రసిద్ధ మీడియా సంస్థలైన రాయిటర్స్, వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలు వీరి నేర చరిత్ర గురించి రాశాయి. ఏపీ నుంచి పెట్టుబడులు ఎలా వెళ్లిపోతున్నాయో స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియాలోనూ వీరి నేర చరిత్ర గురించి రాసినప్పుడు ట్రంప్ విందుకు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పిలుస్తారో వైసీపీ నేతలే సమాధానం చెప్పాలి…రస్ అల్ ఖైమా, ఇంటర్ పోల్ వారు వీళ్ల కోసం వెతుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి కాబట్టే దాక్కుంటున్నారు.
• ఒక వైసీపీ ఎంపీ కియా సంస్థలను కారుకూతలను కూయడం వల్ల ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కారు మేఘాలు అలుముకున్నాయి. ఈ పరిస్థితికి వైసీపీ సమాధానం చెప్పడమే కాదు…ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాలి.
• జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలను విదేశీ యూనివర్సిటీల్లో విద్యార్థులకు పాఠాలుగా చెబుతున్నారు. మీరు కొట్టేసిన లక్ష కోట్లు తిరిగి ఇవ్వండి లేదా ప్రజలకు క్షమాపణ చెప్పండి
• మీ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు , ప్రజల దృష్టిని మరల్చేందుకు, కొత్తగా 107 జీవో తెచ్చారు. వైసీపీ నేతలకు కొంచెమైనా సిగ్గుంటే కాస్తైనా ఆలోచించండి.
• చంద్రబాబు నాయుడు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ను ఏపీకి తీసుకొచ్చినప్పుడు డ్వాక్రా మహిళలను ఆయన పక్కన కూర్చెబెట్టి వారి సామర్థ్యాన్ని చాటి చెప్పారు. డ్వాక్రా మహిళల పొదుపు నిర్వహణను చూసి బిల్ క్లింటన్ చప్పుట్లు కొట్టారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడిదే.
• హైదరాబద్ లో ఐటీ ఇంత అభివృద్ధి చెందిందంటే అందుకు చంద్రబాబు నాయుడి కృషే కారణమని సందర్భం వచ్చినప్పుడల్లా కేటీఆర్ చెబుతున్నారు. చంద్రబాబుని ఆదర్శంగా తీసుకోవాలని దావోస్ లో ఆయనతో కేటీఆర్ సెల్ఫీలు దిగారు.
• ట్రంప్ వస్తే కాదు….అండర్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం వస్తే  జగన్మోహన్ రెడ్డికి పిలుపు వస్తుందని ప్రజలు నవ్వుకుంటున్నారు.
• ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండుంటే అమరావతి పరిస్థితి ఇలా ఉండేదా? అమరావతికి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఉండేవి. 13 జిల్లాలకు పరిశ్రమలు వెల్లువెత్తేవి. కియా అనుబంధ సంస్థలు పారిపోయేవి కాదు…
• జగన్మోహన్ రెడ్డి కుయుక్తులు ప్రజలు గమనిస్తున్నారు. పాలన చేతకాకపోతే రాజీనామా చేసి తప్పుకోండి. అంతేకానీ రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించి భవిష్యత్ లేకుండా చేయొద్దని మేం హెచ్చరిస్తున్నాం…..