నరసరావుపేటలో ‘దిశ’  పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన హోం మంత్రి సుచరిత

548

గర్భంలో ఎంత రక్షణ ఉంటుందో.. అలాంటి రక్షణ ఏపీలో ఉందని హోంమంత్రి మేకతోటి సుచరితఅన్నారు. ఆదివారం ఆమె నరసరావుపేటలో ‘దిశ’  పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యామూల్ ఆనంద్, రేంజి ఐజీ వినీత్ బ్రిజిలాల్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి  శ్రీనివాసరెడ్డి, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ ఘటన దేశంలో సంచలనం కలిగించిందని.. ఇలాంటి సంఘటనలు ఏపీలో జరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ చట్టాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.