తెలతెల వారగానే.. ఇంటివద్దకే సామాజిక భద్రత పెన్షన్లు..

245

విజయవాడ నగరంలో ని మూడు నియోజకవర్గ ల పరిధిలో ఆదివారం మధ్యాహ్నం వరకు 27029 మంది లబ్దిదారులకు రూ.6 కోట్ల 95 లక్షల 26 వేల పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని విజయవాడ మునిసిపల్ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్ తెలిపారు.

ఆదివారం విజయవాడలోని 6, 18 వార్డుల పరిధిలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సామాజిక భద్రతా పెన్షన్లు లబ్దిదారులకు ఇంటి దగ్గర ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. నగరంలో మొత్తం 54,056 మంది లబ్ధిదారులకు వృధ్యాప్య, వితంతు, ప్రతిభావంతుల, చేనేత, డయాలసిస్, దీర్ఘకాలిక వ్యాధుల తదితర పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. మధ్యాహ్నం వరకు 54 శాతం మంది కి పెన్షన్లు వార్డ్ వాలంటీర్లు ద్వారా అందించడం జరిగిందని, సాయంత్రం వరకు దాదాపు పూర్తి స్థాయిలో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అధికారులు వార్డ్ కార్యదర్సులు, వాలంటీర్లుని సమన్వయం చేసుకుంటూ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధుల,మహిళల, ప్రతిభావంతుల, తదితరుల ఆత్మ గౌరవం కాపాడేలా ఇంటి దగ్గర వాలంటీర్లు వొచ్చి పెన్షన్ సొమ్ము ఒకటొవ తారీఖున ఇవ్వడం పట్ల అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.