పోలవరం పనులను పరిశీలించిన జగన్

309

పోలవరం: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పోలవరం పర్యటన కొనసాగుతోంది. ప్రత్యేక హెలికాప్టర్‌లో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం చేరుకున్న సీఎం.. ప్రాజెక్టు ప్రాంతంలో పనుల పురోగతిని విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం హెలిప్యాడ్‌ వద్ద గత్తేదారులు, ఇంజినీర్లు, అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. ప్రాజెక్టు స్పిల్‌ వే, కాఫర్‌ డ్యాం పనులను పరిశీలించారు. అధికారులు, గుత్తేదారులను అడిగి పనుల వివరాలను తెలుసుకున్నారు. స్పిల్‌ వే, కాఫర్‌ డ్యామ్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సీఎం సందర్శించారు. నిర్వాసిత గ్రామాల్లో పునరావాస పనులపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం సమావేశమై చర్చించనున్నారు.