ఎంపిటిసి అతని భార్య, గవర్నమెంట్ హాస్పిటల్ లో కలిసి పరామర్శించిన ఎమ్మెల్సీ పోతుల సునీత

721

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపిటిసి కోడూరు వెంకటేశ్వర్లు అతని భార్య మంగమ్మ లను గవర్నమెంట్ హాస్పిటల్ లో కలిసి పరామర్శించిన ఎమ్మెల్సీ పోతుల సునీత

రామచంద్రాపురంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపిటిసి కోడూరి వెంకటేశ్వర్లు మరియు అతని భార్య మంగమ్మ లపై నిన్న రాత్రి జరిగిన దాడిని ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆమె బాధితులను పరామర్శించి వారికి అండగా నిలిచారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరైతే వెంకటేశ్వర్ల పై అతని భార్య పై దాడి చేసి తీవ్రంగా హింసించారో వారిని వెంటనే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని పోలీసువారికి తెలియజేశామని ఆమె అన్నారు

పాపాయి పాలెం గ్రామ వాలంటీర్ల దాడిలో గాయపడి వైద్యశాలలో చికిత్స పొందుతున్న పులి శ్రీనివాసరావు ని కలిసి పరామర్శించిన ఎమ్మెల్సీ పోతుల సునీత

పాపాయి పాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అదే గ్రామానికి చెందిన పులి శ్రీనివాస్ పై గ్రామ వాలంటీర్లు కత్తితో దాడి చేయడం జరిగింది ఈ దాడిలో గాయపడిన పులి శ్రీనివాసరావు ని స్థానిక గవర్నమెంట్ హాస్పటల్ లో పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్సీ పోతుల సునీత ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు అనేవారు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేసేందుకు మాత్రమే పని చేయాలి కానీ ఇలా దాడులు చేయటం సరికాదు అని దాడులు చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరడం జరిగిందని ఆమె అన్నారు