చంద్రబాబుకు నిరసన తెలిపినవారిలో పులివెందులనుంచి వచ్చారని నిరూపిస్తే ఎంఎలఏ పదవికి రాజీనామా చేస్తా

324

చంద్రబాబుకు నిరసన తెలిపినవారిలో పులివెందులనుంచి వచ్చారని నిరూపిస్తే ఎంఎలఏ పదవికి రాజీనామా చేస్తా.

ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖ వద్దంటూ చెప్పిన చంద్రబాబు వస్తే ప్రజలు అడ్డుకోక ముద్దుపెట్టుకుని హారతులిస్తారా?
ఉత్తరాంధ్రప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
చంద్రబాబుపై టమాటాలు,కోడిగుడ్లు,చెప్పులు విసిరింది టిడిపి శ్రేణులే
ఎన్టీఆర్‌ పై చెప్పులు వేయించిన చంద్రబాబుకు కర్మసిధ్దాంతం అప్లయ్‌ అయింది
చంద్రబాబుపై ప్రజలు నిరసన తెలియచేస్తే వైయస్సార్‌ సిపి–టిడిపి గొడవలా పచ్చమీడియా రాయడం దారుణం
పార్టీ ఎంఎల్‌ ఏ శ్రీ గుడివాడ అమరనాద్‌ ప్రెస్‌ మీట్‌ పాయింట్స్
–––––––––––––––––––––––––––––––––––––––
విశాఖపట్నం- ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విశాఖలో చెప్పులు,కోడిగుడ్లు,టమాటాలు వేసింది,వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారు కాదని, టీడీపీ శ్రేణులేనని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. టీడీపీ అధినేతపై చెప్పులు వేయడం ఆ పార్టీ సాంప్రదాయమని అన్నారు.ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడటంతోనే విశాఖలో ఆయనను అడ్డుకున్నారని, దీన్ని రెండు పార్టీల మధ్య జరుగుతున్న తగాదాగా చిత్రీకరించడం సరికాదన్నారు.విశాఖపట్నంలో అమర్‌ నా«ద్‌ మీడియాతో∙ఇంకా ఏమన్నారంటే…..ఆయన మాటల్లోనే….
1. ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖను అడ్డుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.రాజధానిగా విశాఖను చంద్రబాబు అడ్డుకుంటున్నారని తెలిసీ ఉత్తరాంధ్ర ప్రజలు నిన్న విశాఖకు వచ్చిన సందర్భంగా గో బ్యాక్‌ చంద్రబాబు అంటూ నినదించారు. చంద్రబాబును అడ్డుకున్నది వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు మాత్రమే అంటూ టీడీపీకి చెందిన మీడియా సంస్థలు బ్యానర్‌ కథనాలు రాశాయి. ఇదీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్, టీడీపీకి మధ్య జరిగే గొడవలా కధనాలలో రాసుకొచ్చాయి.
2.అమరావతిలో ఉద్యమాలు జరిగితే అది జాయింట్‌ యాక్షన్‌ కమిటీలు, అక్కడ స్వచ్ఛంద ఉద్యమ సంస్థలు, భూములు ఇచ్చిన రైతులు చేసినట్లు చెబుతున్నారు. అదే విశాఖలో ప్రజలు అడ్డుకుంటే దాన్ని మాత్రం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అంటగడుతున్నారు.చేతిలో మీడియా సంస్థలు ఉన్నాయని ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించకుండా రాయడం అన్యాయం.
3.మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినా ఎలాంటి మార్పు రావడం లేదు.చలి చీమకు రెక్కలొచ్చినా..ముసలివాడికి పిచ్చి వచ్చినా ఎక్కువ కాలం భూమి మీద నిలబడవన్న సామెత ఉంది. ఆ సామెతలు మీ కార్యక్రమాలు చూస్తే గుర్తుకు వస్తున్నాయి.
4.ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమాలు చేయడానికి పనికి రారా? ఈ దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామారాజు పుట్టిన గడ్డ ఈ ప్రాంతం. దేశమంటే మట్టి కాదోయ్‌..దేశమంటే మనుషులోయ్‌ అని నినదించిన గురజాడ అప్పారావు పుట్టిన గడ్డ ఇది. ఎంతో మంది వీరమరణం పొంది విశాఖ ఉక్కును సాధించుకున్న నేల ఇది.
5. పులివెందుల నుంచి మనుషులను తీసుకొచ్చారని అంటున్నారు. ఈ ఉద్యమానికి రాయలసీమకు ఏం సంబంధం. నాకు ఆకలేస్తే నేను అడుగుతాను..ఉత్తరాంధ్ర ప్రాంతం ఇంకా పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగా మార్చారు..దీన్ని ఉత్తమ ఆంధ్రాగా తీర్చిదిద్దాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన.
6. నిరసనకారులు పులివెందుల నుంచి వచ్చారని లోకేష్‌ అంటున్నారు. ఈ ఉత్తరాంధ్ర ప్రజలు కడుపు కాలి ఉద్యమిస్తున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబును అడ్డుకోక ముద్దు పెట్టుకుంటారా?హారతులిస్తారా? పూలు జల్లి స్వాగతిస్తారా?
7.ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్న ఏ వ్యక్తినైనా అడ్డుకుంటారు.అటువంటి పరిస్థితిలో పులివెందుల నుంచి మనుషులు వచ్చారని చెప్పడం సిగ్గు చేటు. ఎవరైనా పులివెందుల నుంచి ఏ ఒక్కరు వచ్చినట్లు నిరూపించినా కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా…
8.సవాల్‌ కు నారాలోకేష్‌ రెడియా?లోకేష్‌ ఇలాంటి చాలెంజ్‌ స్వీకరించడానికి కూడా అవకాశం లేదు. నేడో, రేపో ఆయన ఎమ్మెల్సీ పదవి పోవడం ఖాయం.ఆయనకు ఏమని సవాలు విసురాలో కూడా తెలియదు. చేసిన ఆరోపణలపై నిలబడటం లేదు. గతంలో తునిలో రైలుకు నిప్పుపెడితే…. అమరావతిలో అరటి తోటలు తగలబడితే వాటికి పులివెందుల నుంచి వచ్చారని ఆరోపించారు.వారు అ«ధికారంలోకి వచ్చినా కూడా వాటిని నిరూపించలేకపోయారు.
9.గోదావరి పుష్కరాల్లో 29 మంది మరణానికి చంద్రబాబు కారణమైతే దానికి కూడా పులివెందుల పేరు చెబుతున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా..ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు జరిగినా పులివెందులనే కారణమా?
10. చంద్రబాబు పుట్టిన నియోజకవర్గం చంద్రగిరి, 1983లో అక్కడ చిత్తు చిత్తుగా ఓడిస్తే..కుప్పంలో పడ్డారు. లోకేషే ఏమో మంగళగిరి..మీరేమో చంద్రగిరి..అడ్రస్‌ ఏమో హైదరాబాద్‌.
11.42 సంవత్సరాలుగా వైయస్‌ఆర్‌ కుటుంబంతో పెనవేసుకున్న ప్రజలు పులివెందుల ప్రజలు. నమ్మకానికి, విశ్వాసానికి, ప్రేమకు, ఆ ప్రాంతానికి వైయస్‌ఆర్‌ కుటుంబం చేసిన అభివృద్ధికి పులివెందుల ప్రజలు తోడుగా ఉన్నారు.అలాంటి వారిని మీరు కించపరిచి మాట్లాడటం బాధాకరం.
12. పులివెందుల ఈ రాష్ట్రంలోనిది కాదా? వారు ఈ రాష్ట్ర ప్రజలు కాదా?. ఈ రాష్ట్రంలో వారు భాగస్వాములు కాదా?. చంద్రబాబుకు ఆయన కుటుంబం, అమరావతి, ఆ మూడు గ్రామాలు, 33 వేల ఎకరాలు మాత్రమే. రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు.
13.చంద్రబాబు విశాఖలో పెళ్లిళ్లు చూసేందుకు వచ్చి ఉంటే బాగుండేది. అది మానేసి మీ అంతు చూస్తా..అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.ప్రజల మనోభావాలను దెబ్బకొట్టేలా వ్యవహరించడం దుర్మార్గం కాదా?.
14. 14 సంవత్సరాలు సీఎంగా పని చేశారు. 11 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పని చేసిన వ్యక్తి. ఆయనంటే అపారమైన గౌరవం ఉంది. ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. పోలీసు వ్యవస్థలు ఏరకంగా పని చేస్తాయో మీకు తెలియదా?.
15.విశాఖలో, గాజువాకలో మా పార్టీ అభ్యర్థులకు 15 వేల మెజారిటీ వచ్చింది. ఆ కోపంతో ఎంపిగా పోటిచేసి ఓడిపోయిన భరత్‌ వర్గం చంద్రబాబుపై చెప్పులు, గుడ్లు, టమాటాలు విసిరిందని విశాఖలో అనుకుంటున్నారు.టీడీపీ వారే చెప్పుకుంటున్నారు.
16.చంద్రబాబు విశాఖకు వస్తున్నారంటే ఆయన పార్టీకి చెందిన కొందరు ఎంఎల్‌ ఏలు ఎయిర్‌పోర్టుకు రాలేదు. టీడీపీ ఎమ్మెల్యే ఒకరితో నేను మాట్లాడితే..ఆయన ఏమన్నారంటే..తెలంగాణలో ఈ రకంగానే చంద్రబాబు టీడీపీని మూయించాడు. ఈ రోజు ఉత్తరాంధ్రలో మమ్మల్ని ముంచేయడానికి వచ్చాడని అన్నాడు.
17.చంద్రబాబు తాను చేస్తున్న తప్పు తెలుసుకొని ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజధానిగా విశాఖ ఏర్పాటు చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, స్వాగతిస్తున్నామని ప్రకటిస్తే..అప్పుడే ఈ ప్రాంతంలో మీ పార్టీ నాయకులకు భవిష్యత్తు ఉంటుంది.
18.చంద్రబాబూ…ఎన్టీఆర్‌పై చెప్పులు, గుడ్లు నీవు వేయించలేదా?. పార్టీ అధ్యక్షుడిపై రాళ్లు, చెప్పులు విసరడం మీ సాంప్రదాయమేమో?.దీన్ని కర్మ సిద్ధాంతం అంటారు.మా పార్టీ నుంచి గతంలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారు. 23 మంది మళ్లీ టీడీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను మాత్రమే ప్రజలు మీకు ఇచ్చారు.
19.శ్రీ వైయస్‌ జగన్‌ 2017 జనవరి 26న విశాఖలో క్యాండిల్‌ ర్యాలీకి వస్తే ఆ రోజు అడ్డుకున్నది పోలీసులు..ఈ రోజు చంద్రబాబును అడ్డుకుంది పోలీసులు కాదు..ప్రజలే. ఇకనైన చంద్రబాబు తాను చేసిన తప్పులు గ్రహిస్తే బాగుంటుంది.
20. లోకేష్‌ ఇళ్లల్లో దూరి తంతాడట. ఇప్పటికే ఆయన్ను మంగళగిరిలో ప్రజలు తంతే అమరావతి కరకట్టపై పడ్డారు. లా అండ్‌ ఆర్డర్‌ను లోకేష్‌ చేతుల్లోకి తీసుకుంటారట..నీవేమైనా ఐపీఎస్‌ ఆఫీసర్‌వా?.
21.ఇప్పటికైనా రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి చంద్రబాబు కట్టుబడి ఉంటే బాగుంటుంది. మళ్లీ విశాఖలో పర్యటిస్తానని చంద్రబాబు అంటున్నారు. మేం కాదనడం లేదు. కాకపోతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు క్షమాపణ చెప్పి.అమరావతిలో భూముల కోసమే నా ఆరాటమని, ప్రజల కోసం పోరాటం చేయడం లేదని ఒప్పుకుంటే ఈ ప్రాంత ప్రజలు స్వాగతిస్తారు. ఇప్పటికైనా చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.