విశాఖలో పర్యటించి తీరుతా: చంద్రబాబు

395

అమరావతి: త్వరలో విశాఖలో పర్యటించి తీరుతానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్ని సార్లు ఆపగలుగుతారో చూస్తానని మండిపడ్డారు. విశాఖ ఘటనలో పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానానికి వెళ్లాలని తెదేపా నిర్ణయించింది. నిన్నటి విశాఖ పరిణామాలపై పార్టీ నేతలతో చంద్రబాబు శుక్రవారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
అనుమతి ఇచ్చిన కార్యక్రమానికి ఆటంకాలు సృష్టించడం ఏంటని నిలదీశారు. పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్న చంద్రబాబు.. వైకాపా కార్యకర్తలు పోలీసుల సహకారం లేకుండా విమానాశ్రయానికి ఎలా రాగలిగారని ప్రశ్నించారు. కాన్వాయ్‌పై దాడికి దిగిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదనిb ఆక్షేపించిన ఆయన.. పోలీసుల సహకారంతోనే వైకాపా నిరసనలు అని స్పష్టమైందని అభిప్రాయపడ్డారు.