అటెండర్ కూడా ఇలా కూర్చుని మాట్లాడ లేడు..

419

కానీ ఈ కలెక్టర్ చూడండి.. #JayasankarBhupalapally #collectorMDAbdulAzeem 🙏
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కు వచ్చి ఓ గిరిజన వృద్ధురాలు మెట్లపై కూర్చుంది..అధికారుల కోసం చాలా సేపు వేచి ఉంది. అంతలో విధుల్లోకి వస్తున్న కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఆజిం ఆ వృద్ధురాలిని చూసి, ఆమె కూర్చున్న మెట్లపైనే ఆమె పక్కన కూర్చుని పెద్దమ్మా ఏం కావాలి.. ఎటొచ్చారని అడిగారు..ఆయన కలెక్టర్ అని కూడా తెలియని ఆ వృద్ధురాలు సామాన్యునీతో మాట్లాడినట్లే ‘రెండేండ్ల సుంది పింఛన్ వస్త లేదు బిడ్డా సారును కలుత్తమని వచ్చినా’ ఆన్నది.ఎంతో ఆప్యాయంగా అమెతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్న కలెక్టర్ వెంటనే డీఆర్డీఓకు ఫోన్ చేసి వివరాలు చెప్పి ఆ వృద్ధురాలికి పింఛన్ మంజూరు చేయించారు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా..
శభాష్ కలెక్టర్ అంటూ అభినందించారు..