71 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్న రైతులు

466

🔸అమరావతి: రాజధాని గ్రామాల్లో పర్యటించి 71 రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్న రైతులకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

సోమిరెడ్డి కామెంట్స్

🔸ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాష్ట్రానికి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి..రాష్ట్ర పురోగతిని అధ:పాతాళానికి తొక్కేస్తున్నాయి..

🔸ఓ వైపు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన, ముగ్గురు బీజేపీ నేతల ప్రవర్తన రాష్ట్రంలో గందరగోళానికి దారితీస్తోంది..

🔸ఆఖరుకు ఈ దేశంలో ముగ్గురు అధినేతల నిర్ణయానికి విలువ లేకుండా పోతోంది…

🔸జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారు..

🔸బీజేపీ నేతలు సునీల్ దియోదర్, జీవీఎల్, సోము వీర్రాజు మూర్ఘంగా మాట్లాడుతూ జనానికి పిచ్చిపట్టిస్తున్నారు..

🔸రాజధానులను మార్చే వీలుంటే మీ ఉత్తరప్రదేశ్ లో లక్నో నుంచి రాజధానిని మార్పించండి…

🔸దేశంలోని 28 రాష్ట్రాల్లో సీఎంలు మారినప్పుడల్లా వారి ఇంటి పక్కకో, వారికి రాజకీయ పట్టుండే ప్రాంతాలకో రాజధానిని మారుస్తామంటే కుదరదు..అది రాజ్యాంగ విరుద్ధమే..

🔸అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదు..

🔸రాజధాని పెడతామనే ఒప్పందంతోనే ఎన్నో సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టాయి..కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలు తమ కార్యకలాపాలకు భూములు తీసుకున్నాయి..

🔸సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీతో పాటు ప్రజలెన్నుకున్న ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ముగ్గురూ ఆమోదించిన రాజధాని అమరావతి,..

🔸టీడీపీ ప్రభుత్వం చేసిన అమరావతి ప్రతిపాదనను ఆ రోజే ప్రధాని కానీ, ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం వ్యతిరేకించివున్నా రైతులు భూముల్ని ఇచ్చుండే వారు కాదు..

🔸అమరావతిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి పెట్టాలి..

🔸రాజధానిని తరలించడం ఆషామాషీ కాదు..కోర్టులు చూస్తూ ఊరుకోవు….రైతులకు తప్పక న్యాయం జరుగుతుంది..

🔸రాజధాని విషయంలో జరిగే నష్టాలే కాదు…రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ అదుపుతప్పింది…గతంలో ఎక్కడో ఒకటి, రెండు చోట్ల ఒకరిద్దరు అధికారులు, రాజకీయ నాయకులో పొరపాట్లు చేయడం సహజం..

🔸కానీ ఈ రోజు..మంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా నిర్వీర్యం చేసేశారు..వైసీపీ నేతల తీరుతో వారు నిస్సహాయులుగా మిగిలిపోయారు..

🔸రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే రాజ్యాంగ అధినేతలుగా వ్యవహరిస్తున్నారు…రెవెన్యూ, పోలీసు వ్యవస్థలతో పాటు అన్ని శాఖలను తమ గుప్పిట్లో పెట్టేసుకుని శాసిస్తున్నారు..

🔸ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుతో దిక్కుతోచని స్థితిలో అధికారులే తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి..

🔸సీఐలు, ఎస్సైలు, తహసీల్దార్లపై వారి ఉన్నతాధికారులే పట్టుకోల్పోయారు… ఎమ్మెల్యేల తీరుతో ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని ఉన్నతాధికారులే ఆవేదన చెందే పరిస్థితులొచ్చాయి..

🔸జగన్మోహన్ రెడ్డి ఏం ఆదేశాలు ఇస్తున్నారో కానీ…క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి..

🔸కులం, మతం, పార్టీలు చూడొద్దు…అందరికీ న్యాయం చేయండని చెప్పే సీఎం స్టేట్మెంట్లకే పరిమితమయ్యారు…కింది స్థాయిలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది..

🔸మొత్తం మీద పరిపాలన ఘోరంగా మారింది..ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆలోచనలు మారాలి..కక్షలు, కార్పణ్యాలు పక్కన పెట్టకపోతే ప్రజాగ్రహానికి గురికాకతప్పదు..

🔸ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ సీఎం అయ్యి ప్రజల దుంప తెంచుతున్నారు.

🔸మొన్నేదో పత్రికలో రాసినట్టు రాజే రాజ్యాన్ని నాశనం చేస్తుంటే ప్రజల భవిష్యత్ ఏంటో ఆలోచించాలి..

🔸మీకు ఏం కావాలో మీకే అర్ధం కావట్లేదు..చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టాలా…అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టాలా. .మాజీ మంత్రుల మీద కేసులు పెట్టాలా..అనే ఆలోచనలోనే ఉన్నట్టున్నారు..

🔸ఎన్ని సిట్లు ఏం వేస్తారయ్యా మీరు…కొత్త ప్రభుత్వం వచ్చాక మంత్రుల సబ్ కమిటీ..అంతకు ముందొక సిట్…ఇప్పుడొక సిట్…

🔸స్కూల్లో సిట్, స్టాండ్ అని పిల్లలు ఆడుకున్నట్టుంది మీ ఎవ్వారం..కక్ష సాధింపులకే మీ సిట్ లు…

🔸తొమ్మిది నెలల్లో చంద్రబాబు నాయుడిని ఎక్కడైనా ఇరికించాలనే ప్రయత్నం ఫలించకపోవడంతో మీలో ద్వేషం రగిలిపోతోంది..రాష్ట్రం నష్టపడుతోంది…

🔸పేదలకు మీరిస్తామంటున్న సెంటు భూమి 430 చదరపు అడుగులంటే మంత్రి బొత్స బాత్ రూం అంత ఉండదు…అందులో పేదలు పిల్లాపాపలతో ఎలా ఉండాలో….

🔸పట్టణాల్లో పేదల కోసం ఎంతో క్వాలిటీతో కట్టిన ఎన్నో పేదల అపార్టుమెంట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి…మరికొన్ని మధ్యలో ఉన్నాయి..

🔸లక్షల ఇళ్లు సిద్ధంగా ఉంటే వాటిలో గృహ ప్రవేశాలు చేయకుండా బీడు పెట్టి సెంట్ భూమి ఇస్తామంటున్నారు..

🔸మీకేమో 10, 20, ఎకరాల్లో భవంతులు కావాలి…పేదలకు మాత్రం అపార్టుమెంట్లు వద్దా….