ఎంపీ పదవిలో ఉండి వీధి రౌడీలా ప్రవర్తన సిగ్గుచేటు-వంగలపూడి అనిత

400

మహిళలపై దాడిని ఖండించే సమయం సీఎంకు లేదా?

యద: రాజా తద: ప్రజా అన్నట్లు ఒక నేరస్థుడికి రాజ్యాధికారం ఇస్తే ఆయన కింద పని చేసే నాయకులు కూడా నేరస్థుల స్వభావం ఉంటుందనటానికి నిదర్శనం నందిగం సురేష్. గౌరవ ప్రధమైన ఎంపీ పదవికి మాయని మచ్చలా  ప్రవర్తిస్తున్నారు. అబద్దాలడటం, దుర్బాషలాడటం, దాడులు చేయడం, హత్యా ప్రయత్నాలు చేయించడం సురేష్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఎంపీ అన్న విషయాన్ని మరిచి ప్రజలు తమ కాళ్ల కింద చెప్పులా భావించడం సిగ్గుచేటు.  గతంలోను శాంతి యుతంగా అమరావతికి మద్ధతు తెలపమని గులాబీలు ఇచ్చి మరి ప్రాధేయపడిన విద్యార్ధులపై తనను బెదిరించారని తప్పడు కేసులు పెట్టించి చిత్రహింసలకు గురి చేశారు. అమరావతి  పర్యటలో ఉన్న ఎంపీ నందిగం సురేష్ ను అమరావతి జేఏసీకి మద్ధతు తెలపమని కోరగా వీధి రౌడీలతో మహిళలు అని కూడా చూడకుండా దాడి చేయడం హేయం. పైపెచ్చు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం దౌర్బాగ్యం. నందిగం సురేష్ కార్యకర్తకు ఎక్కువ ఎంపీకి తక్కువ. జగన్ మెప్పు కోసం నందిగామ సురేష్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు. గతంలో ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయులు అమరావతి జేఏసీ ఏర్పాటు చేసిన ధర్నాకు వచ్చి చర్చించి వెళ్లారు. అప్పుడు ఎటువంటి ఘటనలు చోటుచోసుకోలేదు. కాని నేడు ఎంపీ నందిగం సురేష్ వచ్చినప్పుడే ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి? దానికి కారణం ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిదర్శనం. అన్నం పెట్టే రైతన్నలను పెయిడ్ ఆర్టిస్టులనడానికి మీకు నోరు ఎలా వస్తుంది?

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ప్రజలకు అనుగుణంగా నడుచుకోవాలి గాని తమ నాయకుడి మెప్పు కోసం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే భంగపాటు తప్పదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పార్లమెంట్ లో ఏనాడైన కేంద్రాన్ని ప్రశ్నించావా? కనీసం మీ నియోజకవర్గం ప్రజల గురించి ఎన్నడైనా ప్రస్తావించావా? కేవలం జగన్ జపం తప్పా మీ నియోజకవర్గం ప్రజలకు మాత్రం చేసింది సూన్యం. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని బీరాలు పలికిన మీరు ఎందుకు కాళ్ల బేరానికి వెలుతున్నారో ప్రజలకు తెలుసు.