చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలను బహుకరించారు. వివరాల ప్రకారం.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతి సందర్భంగా రోయపురం ఆర్ఎస్ఆర్ఎం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ రోజు జన్మించిన శిశువులకు రాష్ట్ర మంత్రి డి. జయకుమార్ బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చారు. జయలలిత జయంతి సందర్భంగా తమ కార్యకర్తలంతా పేదలకు సాయం చేయడంతో పాటు, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అన్నాడీఎంకే పార్టీ పిలుపునిచ్చింది.

కాగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున జయలలితకు నివాళులర్పించారు. అలాగే తలైవికి నివాళిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం రాష్ట్ర సచివాలయం వద్ద మొక్కలు నాటి ఘనంగా నివాళులు అర్పించారు. జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24ను మహిళలు, చిన్నారుల భద్రతా దినోత్సవంగా నిర్వహిస్తామంటూ ముఖ్యమంత్రి పళనిస్వామి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు.

By RJ

Leave a Reply

Close Bitnami banner