నెహ్రూ యువ కేంద్ర నేషనల్ వైస్ చైర్మెన్

-అనంతపురం సాయిబాబా జాతీయ డిగ్రీ కళాశాల నందు నెహ్రూ యువ కేంద్రం వారు ఏర్పాటు చేసిన కాశ్మీరీ యూత్ ఎక్స్చేంజి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ వై కే జాతీయ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి
-ప్రపంచమంతా భారత్ లో మోడీ పర్యటన సందర్భంగా భారతదేశం గొప్పగా పొగుడుతుంటే దేశం పట్ల కోపంతో ప్రపంచానికి విషప్రచారం అందించాలని డిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించారు.
-ఉద్దేశపూర్వకంగా అల్లర్లకు పాల్పడి దేశంపరువుతీయడానికి కుట్రచేశారు.
-కమ్యూనిస్టులు &కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలో అల్లర్లకు పాల్పడడం సిగ్గుచేటు
-మరొకసారి కమ్యూనిస్టులు దేశ ద్రోహులుగా ఢిల్లీలోని సంఘటనతో నిరూపించుకున్నారు .
-కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు క్షమించరనే విషయాన్ని మరిచిపోతున్నారు
_శక్తివంతమైన భారతదేశ ఎదుగుదలకు జాతీయ సమైక్యతా శిబిరాలు దోహదపడుతాయి
-ప్రపంచ దేశాలు భారత్ ను శక్తివంతమైన,అభివృద్ది చెందిన దేశంగా శ్లాఘిస్తుంటే, అగ్ర రాజ్యం అమెరికా అధినేత ట్రంప్ భారత పర్యటనలో భారత్ ను, నరేంద్ర మోదీ పరిపాలనాదక్షతను పొగడుతుంటే కొన్ని విద్రోహకర శక్తులు ,సంఘ విద్రోహశక్తులు భారతదేశ ప్రతిష్ఠను మంటగలిపేలా అల్లర్లు చేయడం సరియైన పద్ధతి కాదు.
-జాతీయ సమైక్యతను పెంపొందించడానికి నెహ్రూ యువకేంద్ర సంఘటన్ ఆధ్వర్యంలో నిర్వహించబడే కార్యక్రమాలుఎంతగానో దేశాభివృద్ధికి తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు.
-కాశ్మీర్ లో యువతకు అభివృద్ది అంటే ఏమిటో తెలియకుండా, బాహ్య ప్రపంచ విషయాలను అనేకం మరుగున పెట్టి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు
– నాలుగు గోడలకే పరిమితం చేస్తూ ఉపాధివైపు మళ్ళించకుండా తప్పుడుమార్గంలో పయనించేలా చేస్తున్నారు.
-ఇలాంటి వారికి దేశంలోని వివిధ ప్రాంతాలకు, భిన్న సంస్కృతులను పరిచయం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని తెలియచేయడం ద్వారా వారిని దేశంపట్ల గౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.
-కాశ్మీరీల బతుకుబండి దిన దిన గండంగా ఉన్న పరిస్థితులనుండి వారికి భరోసా కలిగించే విధంగా మోడీ పాలనా సంస్కరణలు ఉన్నాయని అన్నారు