అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోడీ.

508

అహ్మదాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొతేరాలోని సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియానికి చేరుకున్నారు. లక్షా 10 వేల కెపాసిటీ ఉన్న స్టేడియం మొత్తం జనంతో కిక్కిరిసింది. స్టేడియం వేదికపై భారతీయ విశిష్టతను తెలియజెప్పేలా కార్యక్రమాలు నిర్వహించారు. ఇరు దేశాధినేతలు సభికులకు అభివాదం చేశారు.

అనంతరం భారత్‌, అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు. ప్రధాని నరేం‍ద్ర మోదీ ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నమస్తే ట్రంప్‌ అంటూ సభికులతో పలికించారు. భారత్‌-అమెరికా సంబంధాలు వర్ధిల్లాలి అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మొతేరా స్టేడియం ప్రపంచంలోనే పెద్దదిగా పేరుగాంచింది.