ఇదో విఫల సమాజం

634

మనం జీవిస్తున్న ఈ తెలుగు సమాజం వైపు ఒక్కసారి వెనక్కు తిరిగి చూడండి.
ఈ తెలుగు సమాజం ఓ విఫల సమాజం అనిపించడం లేదా? ఎందుకంటే….
1. ఎన్నికల్లో పోటీ చేసేవాడు ఎటువంటి లుచ్చా అయినా….డబ్బులు ఇస్తే,అతనికి ఓటు వేయడానికి ఏమాత్రం సిగ్గు పడం.
2. ఇంకా చెప్పాలి అంటే… డబ్బులు ఇవ్వనివాడికి ఓట్ వేయం. కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా సరే…
3. ఎదుటి మనిషిని మోసం చేయడానికి నిముషం కూడా ఆలోచించం.
4. లంచాలు ఇవ్వడానికి గానీ…తీసుకోడానికి గానీ అరక్షణం కూడా సిగ్గుపడం.
5. పైపెచ్చు లంచం ఇవ్వనిదే పని చేయం.
6. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకుతుంటాం….అది ఏ రంగమైనా సరే.. పుట్టిన పిల్లాడి నుంచి చచ్చే ముసలోడి దాకా ఇదే యావ.
7.ఏ మనిషికీ…ఏ మనిషిపైనా కనీస గౌరవం కనపడదు. అసలు గౌరవించాలన్న ఆలోచనే రాదు.తారసపడిన మనిషిని ఎలా వాడుకుండామనే ఆలోచన ఒక్కటే మనిషిని నడిపిస్తున్నది.
8. నేను…నా పెళ్ళాం, నా పిల్లలు…నాకులం. నా ఆస్తి…నా సంపాదన. తెలుగు నేలపై మనిషి జీవనానికి ఇదే కొలబద్ద.
9. మహిళకు…;ఆమె మాన, మర్యాదలకు వెంట్రుకపాటి గౌరవం కూడా లభించని పరిస్థితి.
10. కులం…అక్రమ సంపాదన…స్వార్ధం…దౌర్జన్యం…మోసం…దుర్మార్గ ప్రవర్తన మొదలైనవి ఉగ్గుపాలతోనే అలవాటవుతున్న ఈ తెలుగు సమాజాన్ని ఏమని పిలవాలి ?
ఓ విఫల సమాజం అని పిలువ వచ్చా?
తమది ఓ విఫల సమాజమని …అందులో నివసిస్తున్న తెలుగు వారికి తెలుసా ? ఈ విషయం వారికి ఎవరన్నా చెబుతున్నారా? వేల కొద్దీ రాజకీయ నాయకులు…వందలకొద్దీ పార్టీలు…లక్షల కొద్దీ టీచర్లు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు…జయప్రకాశ నారాయణులు..స్వచ్చంద సేవకులు ఉన్నారు కదా! వారిలో ఎవరైనా..తెలుగు సమాజానికి అద్దంలో దాని మొహం ఎలా ఉందో చూపిస్తున్నారా? సమాజాన్ని మార్చడానికి… ప్రశ్నించడానికి ప్రజా జీవితం లోకి వస్తున్నామనే వారైనా…ఎటువంటి సమాజలోకి వస్తున్నారో ఆలోచించారా ?
ఈ సమాజాన్ని ఇలాగే వదిలేస్తే…దాని ప్రయాణం ముందు ముందు ఎంత వడి వడి గా…ఎంత దారుణంగా ఉంటుందో ఎవరైనా ఆలోచించారా ?
ఈ వరద ను నివారించి, తెలుగు జాతి అనే భావాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం కోసం ఏమిచేయాలో ఆలోచిద్దామా?ఇది కూడా చదవండి…సిగ్గులేని సమాజమిది!
                                                                                                            –భోగాది వేంకట రాయుడు