ముగిసిన బీఏసీ సమావేశం

279
ఏపీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నేపథ్యంలో జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి టీడీపీ తరపున ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు.స్పీకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. రాజధాని అమరావతి తరలింపు ఖాయమైన నేపథ్యంలో సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రాంతీయ ప్రణాళిక, అభివృద్ధి బోర్డు ఏర్పాటు బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 3 రాజధానులతో పాటు ప్రాంతీయ బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దని టీడీపీ శాసనసభ్యులు నినాదాలు చేస్తూ బైఠాయించారు.