ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

గంటపాటు కొనసాగిన కేబినెట్ సమావేశంలో మొత్తం ఏడు బిల్లులకు ఆమోదం తెలిపింది.హైపవర్‌ కమిటీ నివేదిక, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లు, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ అంశంపై టేబుల్ ఐటమ్‌గా చర్చించడానికి నిర్ణయించారు. విచారణను లోకాయుక్తకు అప్పచెప్పాలని కేబినెట్‌ నిర్ణయించింది. రాజధాని రైతులకు అదనపు ప్రయోజనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు, 11 వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.విశాఖకు సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు కేటాయింపుకు ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అమరావతిలోనే అసెంబ్లీ కొనసాగించేలా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు, రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ, భూములు ఇచ్చిన రైతులకు కౌలు 15 ఏళ్లకు పెంచేలా.. పలు నిర్ణయాలను ఏపీ కేబినెట్ తీసుకుంది.
ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు
రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ
రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
రూ.2500 నుంచి 5వేలకు పరిహారం పెంపు
భూములు ఇచ్చిన రైతులకు కౌలు 15 ఏళ‍్లకు పెంపు

మంత్రివర్గంలో చీలిక.. తర్వాత చర్చిద్దామన్న సీఎం
ఇదిలా ఉంటే.. అమరావతి, విశాఖ రెండు ప్రాంతాల్లో సీఎం ఆఫీసు ఉండాలని.. కేబినెట్‌లో పలువురు మంత్రులు విజ్ఞప్తి చేశారు. అలాగే అసెంబ్లీ మూడు సెషన్లు అమరావతిలోనే జరగాలని పలువురు మంత్రులు సూచించారు. ఈ నిర్ణయాన్ని కొంతమంది మంత్రులు వ్యతిరేకించారు. కొంచెం గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో.. తర్వాత నిర్ణయిద్దామని సీఎం జగన్ చెప్పారు. దీంతో ఆ వాదనకు ఫుల్‌స్టాప్ పడింది.

You may also like...

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
Close Bitnami banner
Bitnami