ఆందోళన అణచివేతపై చక్రపాణి మహారాజ్ ఆగ్రహం
అమరావతి అక్కడే ఉండాలని స్పష్టీకరణ
నిజమైన ‘సూర్య’ కథనం

(మార్తి సుబ్రహ్మణ్యం)

‘సూర్య’ వెబ్‌సైట్‌లో చెప్పినట్లే జరుగుతోంది. హిందూ ఫైర్‌బ్రాండ్ స్వామి చక్రపాణి మహరాజ్ అమరావతిపై రంగంలోకి దిగారు. హిందూసంస్కృతి,సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించనున్న అమరావతిని రాజధానికి దూరంచేస్తున్న సీఎం జగన్ ప్రయత్నాలపై చక్రపాణి మహరాజ్ ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో టివి5 చానెల్‌లో విడుదలయింది. అది సోషల మీడియాలోవైరల్ అవుతోంది.ఏపీలో జగన్ సర్కారు అనుసరిస్తోన్న క్రైస్తవ మత అనుకూల విధానాలు, రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అఖిల భారత హిందూ మహాసభ తొలినుంచీ వ్యతిరేకిస్తోంది. హిందూ మతాచారాలకు అనుగుణంగా శంకుస్థాపన చేసిన అమరావతిని కాదని.. విశాఖకు తరలిస్తే సహించేది లేదని,జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో హిందువులమనోభావాలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటోందని స్వామి చక్రపాణి ఇటీవలే ప్రధానిమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా..హిందూమహాసభ తెలుగు రాష్ర్టాల బాధ్యుడు, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఇటీవలే బెజవాడకు వచ్చి, భారీ ర్యాలీ నిర్వహించారు(అనుకున్నట్లే.. అమరావతికి హిందూదళం వచ్చేసింది! ). జగన్ తన మతమేమిటోచెప్పాలని, హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాజధాని తరలింపును అడ్డుకునేందుకు, త్వరలో 20వేల మంది సాధువులు అమరావతికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. నిజానికి దీనిపై ‘అమరావతికి హిందూదళం’ పేరుతో ‘సూర్య’ వెబ్‌సైట్‌లో వార్తా కథనం వెలువడిన విషయంతెలిసిందే.తాజాగా స్వామి చ్ర పాణి మహరాజ్ విడుదల చేసిన వీడియో పరిశీలిస్తే… ఏపీలో పాగా వేసేందుకు అఖిల భారత హిందూమహాసభ సిద్ధంగా ఉందన్న సూర్య వార్తా కథనం నిజమని తేలింది.
తాజాగా అమరావతిపై మాట్లాడిన స్వామి చక్రపాణి మహరాజ్ ..అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ, రైతులు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం కఠినంగా అణచివేయాడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులు, ప్రజలను అణచివేయడం నిందార్హం. వారిపై పోలీసులు ప్రదర్శిస్తోన్న దాష్టీకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.అమరావతి కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారికి హిందూ మహాసభ మద్దతునిస్తోంది. ఆ ఆందోళనను జగన్ సర్కారు అర్ధం చే సుకోవాలి. అమరావతి రాజధానిగా ఉండేది.ఉంది.ఉంటుంది. అది పౌరాణిక ప్రశక్తి ఉన్న ప్రాంతం. అమరావతినే రాజధానిగా ఉంచుతామంటూజగన్ త్వరలోనే ప్రకటించాల’ని అల్టిమేటం జారీ చేశారు. దీన్నిబట్టి.. అమరావతి రాజధానిపై హిందూమహాసభ ఎంత సీరియస్‌గా ఉందో స్పష్టమవుతోంది.

By admin

Close Bitnami banner